తిరుపతి - పీలేరు జాతీయ రహదారి చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో 100కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బ్రిడ్జ్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రాత్రిపూట గంజాయి బ్యాచ్ ఈ బ్రిడ్జి మీద హల్ చల్ చేస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కోర్టు కేసులు పూర్తిచేసి బ్రిడ్జిని రాకపోకలను కల్పించాల్సిన అవసరం ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.