వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రామాపురం కు చెందిన ఓబుళరెడ్డి నియమితులయ్యారు. శనివారం ఈ మేరకు వైసీపీ అధినాయకత్వం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్. డీ పూర్తి చేసిన ఓబులరెడ్డి, సుదీర్ఘకాలం విద్యార్థి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.