తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట పంచాయతీ, కట్టకిందపల్లిలో ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు తిరుపతి గోశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న టి. భాస్కరయ్య (65)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.