చంద్రగిరి: మానవత్వం చాటుకున్న జన సైనికులు

79చూసినవారు
చంద్రగిరి: మానవత్వం చాటుకున్న జన సైనికులు
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు–ముళ్ళపూడి రోడ్డులో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక పెద్దాయనకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న జనసేన నాయకులు అప్రమత్తమై, తమ వద్ద ఉన్న జనసేన కండువాతో రక్తస్రావం ఆపే ప్రయత్నం చేశారు. అనంతరం బాధితుని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానికులు జనసైనికుల పట్ల కృతజ్ఞత తెలిపారు.

సంబంధిత పోస్ట్