చంద్రగిరి: ఈతకు వెళ్లి ఉపాధ్యాయుడి మృతి

70చూసినవారు
చంద్రగిరి: ఈతకు వెళ్లి ఉపాధ్యాయుడి మృతి
ఈతకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.బోడేవాండ్ల పల్లె పంచాయతీ సారగుంటపల్లెకు చెందిన నందకుమార్‌ (42) పీలేరులో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన తన కుమార్తె దీపికతో కలిసి పించా ఏరులో ఈతకు వెళ్లారు. నీటిలో దూకినప్పుడు తలకు బలంగా రాయి తగిలింది. చాలాసేపటి వరకూ తండ్రి పైకి రాకపోవడంతో కుమార్తె ఇంటికొచ్చి తల్లి స్వర్ణకు చెప్పింది. భర్త నీటిలో విగతజీవిగా ఉండటం చూసి, కన్నీరుమున్నీరైంది.

సంబంధిత పోస్ట్