చంద్రగిరి మండల పరిధిలోని శ్రీవారిమెట్టు మార్గం భక్తులు లేక వెలవెలబోయింది. శనివారం అయితే విపరీతమైన రద్దీతో సందడిగా ఉండే ఈ మార్గం బోసిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే టీటీడీ దర్శన భాగ్యం కల్పించడంతో శ్రీవారిమెట్టు మార్గం కల తప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం అధిక శాతం భక్తులు గురువారం రాత్రి తిరుమలకు చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.