మంగళంలో ఎవరు లేని ఇంట్లో దొంగతనం

77చూసినవారు
మంగళంలో ఎవరు లేని ఇంట్లో దొంగతనం
తిరుపతి రూరల్ పరిధిలో మరో దొంగతనం జరిగింది. మంగళం పంచాయతీకి చెందిన వెంకటకృష్ణ కుమార్తె సీమంతం కోసం బెంగళూరు వెళ్లారు. 3 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. తాళాలు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. 250గ్రాముల బంగారం అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్