తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు సిట్ అధికారం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. నాతో ఉన్నవారిని రహస్య ప్రదేశాల్లో చిత్రవధ చేస్తున్నారని, స్టేట్‌మెంట్లపై సంతకాలు తీసుకునేందుకు మానసిక, శారీరకంగా బాధిస్తున్నారు. సిట్ ఘట్టమనేని శ్రీనివాస్ స్క్రిప్ట్ అమలుచేస్తోంది. కోర్టుల్లో ఇవి నిలబడవు అని అన్నారు.