చంద్రగిరి: దామల చెరువు -కల్లూరు మార్గంలో ముళ్ల చెట్లు సమస్య

81చూసినవారు
చంద్రగిరి: దామల చెరువు -కల్లూరు మార్గంలో ముళ్ల చెట్లు సమస్య
తిరుపతి జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు - కల్లూరు మధ్య చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాహనాలు తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ముళ్ల కొమ్మలు తగలడంతో గాయాలే కాక ప్రమాదాలకి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రహదారులపై పెరిగిన చెట్లు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్