చంద్రగిరి: చెరువులో బోల్తా పడిన ట్రాక్టర్

52చూసినవారు
చంద్రగిరి: చెరువులో బోల్తా పడిన ట్రాక్టర్
ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన పాకాల మండలం ఊట్లవారి పల్లి-కృష్ణాపురం మార్గంలో కరణం చెరువు వద్ద గురువారం చోటుచేసుకుంది. పాకాల వైపు వస్తున్న కారుని తప్పించబోయి అదుపుతప్పి ట్రాలీతో సహా ట్రాక్టర్ చెరువులో బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు. సింగల్ రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని డబుల్ రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్