చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈ వ్యక్తి తెల్లటి టీషర్ట్, జీన్స్ ప్యాంటు ధరించి ఉండగా, ఘాటు రహదారికి సుమారు 30అడుగుల లోతులో పడి ఉన్నాడు. ఇది ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరామిరెడ్డి, ఎస్ఐ అనిత సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.