చంద్రగిరి మండలంలో వ్యవసాయ యాంత్రికరణ సబ్సిడీ పథకం కింద రైతులకు వ్యవసాయ పనిముట్లు, పశువుల దాణా పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి మండలంలో 2. 65 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పనిముట్లు 15 మంది రైతులకు ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు.