రామచంద్రాపురంలో పర్యావరణ ధ్వంసం

59చూసినవారు
రామచంద్రాపురంలో పర్యావరణ ధ్వంసం
రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు పంచాయతీ రాజారెడ్డి నగర్ లో కొండలు, చెరువులు, పచ్చదనం నాశనమవుతోంది. జంప్ జిలానీలుగా పేరుగాంచిన మట్టి మాఫియా మూడు పూటలా మట్టిని తరలిస్తోంది. అధికార పార్టీ నాయకులు వీరికి అండగా ఉన్నట్టు సమాచారం. విలువైన ప్రకృతి వనరులు కనుమరుగై, పచ్చని ప్రదేశాలు మట్టిమయమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్