గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పులివర్తి సుధా రెడ్డి

75చూసినవారు
గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పులివర్తి సుధా రెడ్డి
చంద్రగిరి మండలం, చిన్న రామాపురం పంచాయతీ, బి. జి పల్లిలో శుక్రవారం రాత్రి వైభవంగా బాట గంగమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించారు. బాట గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న సుధా రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్