కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలం రెడ్డి దినేశ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాన్ని ఈ. వో అందజేశారు.