పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకన్న

61చూసినవారు
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ఈ ఉత్సవాలు మూడు రోజులు పాటు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్