విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్వర పారిశుద్ధ్య సేవలను అందించడం కోసం బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు తరలి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం కోసం చిత్తూరు నగరపాలక సంస్థ నుండి నలుగురు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, నలుగురు మేస్త్రీలు, 63 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక బస్సుల్లో విజయవాడ కు వెళ్ళారు.