చిత్తూరు వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో ఏఎస్ఐ మణి, హెడ్ కానిస్టేబుల్ మురుగయ్య పదవి విరమణ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, 40 ఏళ్లుగా విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన వారి సేవలను కొనియాడారు. విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పోలీస్ అధికారులు పాల్గొన్నారు.