విద్యార్థులు ఒత్తిడిని వదిలేసి ప్రణాళికా ప్రకారం చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని గుడిపాల మండల ఎంఈఓ హసన్ భాషా అన్నారు. బుధవారం మండలలోని నరహరిపేట ఉన్నత పాఠశాల, బొమ్మసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులుకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బొమ్మసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు.