చిత్తూరులో గురువారం దారుణం హత్య చోటు చేసుకుంది. నగరంలోని 47వ డివిజన్లో వెంకట రెడ్డిని ఆయన కుమారుడే హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డెడ్ బాడీని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.