రామసముద్రం మండలంలో మహిళ మెడలో గొలుసు అపహరణ

68చూసినవారు
రామసముద్రం మండలంలో మహిళ మెడలో గొలుసు అపహరణ
రామసముద్రం మండలం వూలపాడు పంచాయతీ నర్సాపురం గ్రామంలో మహిళ మెడలో గొలుసు కాజేచేశారని రామసముద్రం ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. గ్రామంలో నివాసం ఉంటున్న కోనంగి గంగప్ప భార్య ఎల్లమ్మ అనే మహిళ శనివారం వేకువ జామున మూత్ర విసర్జన చేయడానికి బయటికి రాగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసు తెంచుకొని ఉడయించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్