చిత్తూరు: పదవీవిరమణ పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

9చూసినవారు
చిత్తూరు: పదవీవిరమణ పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు
జూన్ నెలలో పదవీవిరమణ పొందిన 8 మంది పోలీస్ అధికారులు, 3 మంది హోం గార్డులకు జిల్లా ఎస్పీ వి. ఎన్. మణికంఠ చందోలు ఘనంగా వీడ్కోలు తెలిపారు. శనివారం పోలీస్ గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి బహుమతులతో సత్కారం చేశారు. 42 ఏళ్ల ప్రజాసేవను ఎస్పీ ప్రశంసించారు. కుటుంబాల నుంచి దూరంగా పని చేసిన వారి త్యాగాన్ని గుర్తు చేశారు. పదవీవిరమణ అనంతరం ఆరోగ్యం, కుటుంబంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్