చిత్తూరులో భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు ఆదేశించారు.