చిత్తూరులో ఏఐటీయూసీ నేతల నిరసన

85చూసినవారు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షులు నాగరాజు అన్నారు. గాంధీ విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఉక్కు కర్మాగారంలో తొలగించిన 2,500 కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్రం చిత్తశుద్ధి లేకుండా ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్