చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో డా. బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మేయర్ ఎస్ అముద, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, డిప్యూటీ మేయర్లు ఆర్. చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.