చిత్తూరు జిల్లా ప్రత్యేకాధికారిగా చక్రధరబాబు ఐఏఏస్ నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.