చిత్తూరు: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: భారతి

55చూసినవారు
చిత్తూరు: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: భారతి
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరని డీఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి గురువారం అన్నారు. చిత్తూరులో ఓ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా బాల్య వివాహాల నిర్మూలన గోడపత్రికను ఆవిష్కరించారు. 18 ఏళ్లు నిండని బాలికలకు పెళ్లి చేయడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశాలను వివరించారు. ఎన్జీవో ప్రతినిధి రామారావు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్