చిత్తూరు: గంగమ్మను దర్శించుకున్న చూడా చైర్ పర్సన్

81చూసినవారు
చిత్తూరు: గంగమ్మను దర్శించుకున్న చూడా చైర్ పర్సన్
చిత్తూరు నగరంలోని మాపాక్షలో గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా అమ్మవారిని చూడా చైర్ పర్సన్ కటారి హేమలత బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చూడా చైర్ పర్సన్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్