చిత్తూరు నగర కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్వో లోకేష్ బుధవారం ఉదయం నడివీధి గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, సంతపేట పలు ప్రాంతాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జాతరలో భక్తులకు నీటి సరఫరా ఉంచారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. అనంతరం వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా పరచాలని అధికారులను ఆదేశించారు.