రాష్ట్ర మహిళలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కోర్టు నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కార్జాల అరుణ, చుడ చైర్ పర్సన్ కటారి హేమలత తెలిపారు.