చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ సుధారాణి శుక్రవారం నిర్వహించారు. అధికారులు సిబ్బంది చేత యోగ సాధన చేయించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా, ధ్యానం చేపట్టాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించవచ్చును అన్నారు.