చిత్తూరు పట్టణంలోని దుర్గానగర్ కాలనీలోని రోసి నగర్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తాగుడుకు బానిసై తన తల్లి వసంతమ్మును తాగడానికి డబ్బులు అడిగాడు. లేవు అనడంతో కాలితో బలంగా తన్నాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో స్విమ్స కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం తెలిపారు.