కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. సోమవారం చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కృషితోనే ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి-కాట్పాడి వరకు డబ్లింగ్ లైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించారన్నారు. దీనిపై తాము హర్ష వ్యక్తం చేస్తున్నాం అన్నారు. చిత్తూరు ప్రజల చిరకాల కల సాకారం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.