చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో హెచ్ఎం భాను ప్రభ ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా స్కూల్ కమిటీ ఛైర్మన్ రాజేశ్, వైస్ చైర్మన్ గీత పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు.