చిత్తూరు నగరంలోని 8వ వార్డు శ్రీనివాస నగర్ కాలనీ నందు మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పూడిక నిండిపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దోమలు, ఈగలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా కాలనీవాసులు వ్యాధులకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కాలనీ ప్రజలు సంబంధిత అధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని కోరారు.