ఏపిడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టు సంఘం నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని బుధవారం చిత్తూరులో నిర్వహించారు. అధ్యక్షులు కేశవులు, కార్యదర్శి బాలు యూనియన్కు సంబంధించి పలు అంశాలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.