బెట్టింగ్ కు పాల్పడుతోన్న నలుగురిని చిత్తూరులోని సంతపేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. Defabet sports అనే యాప్ లో బెట్టింగ్ చేసిన రాజా అనే ప్రధాన నిందితుడు లాభాలు వస్తున్నాయన్న ఆశతో భార్య నగలను సైతం తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును యాప్ లో పెట్టి వారం రోజుల్లోనే రూ.4-5 లక్షలు కోల్పోయాడు. దీంతో ఎక్కడైనా ఎవరైనా బెట్టింగ్ చేస్తున్నారని తెలిస్తే వెంటనే వాట్సాప్ నంబర్ 9440900005కు సమాచారమివ్వాలని ఎస్పీ మణికంఠ తెలిపారు.