క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. చిత్తూరు పట్టణంలోని సంతపేటలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నెట్టికంటయ్య సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న రాజా, దస్తగిరి, సరుద్దీన్, మునిని అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. వారి వద్ద రూ. 48, 000 స్వాధీనం చేసుకున్నామన్నారు.