ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన రెడ్డి, అతని పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లకు తెలంగాణ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు వేసిన ఏడేళ్ల శిక్షను సస్పెండ్ చేస్తూ, దేశం విడిచి పోకూడదని, ఒక్కొక్కరూ రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలనే షరతులు విధించింది. ఈ కేసులో మే 6న నలుగురికి శిక్షలు ఖరారు చేశారు.