లింగ నిర్థారణ చేస్తున్న ఓ స్కానింగ్ కేంద్రాన్ని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం తమిళనాడు వైద్యాధికారులతో కలిసి చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేశారు. అనంతరం చిత్తూరుకు చెందిన క్లారా మేనకా దేవి, ఆమె సహాయకురాలు నళిని, సునీతను ప్రశ్నించి, స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారు. వారిని పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై రాత్రి వరకూ ఎలాంటి కేసూ నమోదు కాలేదు.