ఈ నెల 9 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని అధ్యక్షులు నాగరాజు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో రమాదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 9 న సార్వత్రిక సమ్మె ప్రకటించడం జరిగిందన్నారు.