చిత్తూరు: చేతివృత్తిదారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

55చూసినవారు
చేతి వృత్తిదారులను ఆదుకుని, కాపాడాలని చేతివృత్తిదారుల సమైఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చిత్తూరులోని ఎస్టియు కార్యాలయంలో శుక్రవారం రజక వృత్తిదారుల సమైక్య సమావేశం నిర్వహించారు. చేతి వృత్తిదారులు తమ వృత్తులను కొనసాగించలేక అర్ధాకలితో జీవిస్తూ ఆకలి చావులకు గురవుతున్నారన్నారు. చేతివృత్తిదారులకు ప్రథమ ప్రాధాన్యత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్