చిత్తూరు: 36 మందికి భారీ జరిమానా

77చూసినవారు
చిత్తూరు: 36 మందికి భారీ జరిమానా
చిత్తూరు నగరంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 6 మందికి రూ. 60 వేలు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్లు వన్టౌన్ సీఐ మహేశ్వర్ శుక్రవారం తెలిపారు. బహిరంగంగా మద్యం తాగిన మరో 30 మందికి రూ. 30 వేల జరిమానా విధించారన్నారు. మొత్తం మద్యం కేసులో రూ. 90 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్