హోలీ పండుగను ప్రజలు ఆనందంగా, జాగ్రత్తగా నిర్వహించుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు గురువారం అన్నారు. అనంతరం ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఎక్కడైనా బలవంతంగా రంగులు చల్లడం, అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను వేధించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణమే పోలీస్ కంట్రోల్ సెంటర్ 9440900005 లేదా 112 నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.