మాసిన గడ్డాలు,నలిగిపోయిన బట్టలతో ఇక్కడున్న వారంతా బేల్దారి పనుల కోసం ఎదురుచూస్తున్న కూలీలు. రోజూ పనుల కోసం కూలీలు ఇక్కడ గుమికూడి ఎదురుచూస్తారు. చిత్తూరు నగరమే కాకుండా యాదమరి, బంగారుపాళ్యం, పూతలపట్టు ప్రాంతాల నుంచి రోజూ కూలీలు చిత్తూరు చర్చివీధిలోని మార్కెట్ చౌక్‌కు చేరుకుంటారు. నగరంలో జరుగుతున్న పనుల కోసం కాంట్రాక్టర్లు, మేస్త్రీలు అక్కడకొచ్చి అవసరమైనంత మంది కూలీలను ఆటోల్లో, ద్విచక్రవాహనాలపై తీసుకెళతారు.