చిత్తూరు ఎమ్మార్వో ఆఫీసు నందు విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ భార్గవ్ సేవలు అమోఘం అని పలువురు ప్రశంసించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజలు ఆన్ లైన్ లో అప్లై చేసిన సర్టిఫికెట్ లను దగ్గరుండి అందజేసేవారు. అంతే కాకుండా సంబంధిత అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఆయన పై హర్షం వ్యక్తం చేశారు.