బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని మేయర్ ఎస్.అముద చెప్పారు. జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆయన సేవలను నేటితరం స్మరించుకోవాలన్నారు.