చిత్తూరు నగర పరిధిలోని అరగొండ రోడ్డులోని బ్యాన్స్ హోటల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తవణంపల్లి మండలానికి చెందిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన గమనించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.