వైజాగ్లో ఈనెల 21వ తేదీన జరిగే యోగాంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెప్మా పీడీ రాధమ్మ, ఎంపీడీవో శ్రీనివాసులు కోరారు. చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 14న మండల స్థాయి యోగా పోటీలు నిర్వహించాలన్నారు. మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో రోజూ సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు.