ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనన, మరణాల రేటుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారని సీఆర్ఎస్-2022 నివేదిక పేర్కొంది. కేంద్రం మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022లో మొత్తం 21,954 జననాలు, 15,124 మరణాలు జరిగాయి. వీటిలో పురుషుల జననాలు 11,397, మహిళలవి 10,557. మరణాల్లో పురుషులు 9,006 కాగా, మహిళలు 6,118. గత మూడేళ్లలోనూ ఇదే విధంగా కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.